డాక్టర్ బిఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు దినం పురస్కరించుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ రద్దు చేసినట్లు ఐటీడీఏ పీవో సింహాచలం ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రంపచోడవరం ఐటిడిఏ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్ జరగదని కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలందరూ వారి సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఐటిడిఏ కార్యాలయానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.