రంపచోడవరం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్ లోతా లక్ష్మణ రావు, వైస్ ఛైర్మన్ సలాది బాపిరాజు మరియు మెంబర్లుగా ఎన్నికైన ఆచంట శ్రీనివాసరావు, జయమ్మ, మాణిక్యం, రాంబాబు, సత్యనారాయణమ్మ, రామారావు, సాల్మన్ రాజు, శివ శంకర వరప్రసాద్, సత్యవతి, అమ్మాజీ, గీతాంజలి, రాంబాబుల ప్రమాణస్వీకరణ తదనంతరం రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యులు శిరీష దేవి, మాజీ శాసనసభ్యులు చిన్నం బాబూ రమేష్ పార్టీ నాయకులు వారికి అభినందనలు తెలియజేశారు.