రంపచోడవరం: గత కొద్ది రోజులుగా అల్పబడిన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మరోపక్క గోదావరి నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుండడంతో కునవరం మండలంలో వరదల భయంతో గ్రామాలు విడిచి సురక్షత ప్రాంతాలకు ప్రజలు తమ సామానులు తీసుకుని ప్రయాణం అవుతున్నారు. వరద ఉద్ధృతి అకస్మాత్తుగా పెరిగితే గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని అందువల్లనే సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నామని చెబుతున్నారు.