రంపచోడవరంలో ఈనెల 9వ తేదీన జరగవలసిన ఆదిమా తెగల సాంస్కృతిక సాంప్రదాయ రేల పండుగ సమ్మేళనాన్ని వాయిదా వేస్తున్నామని ఆదివాసి జేఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. మంగళవారం రంపచోడవరం నుంచి ఓ ప్రకటనలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. దీనిని ఆదివాసీలు ఉద్యోగులు మేధావులు కళాకారులు గమనించాలని ఆయన కోరారు. త్వరలో నిర్వహించే తేదీ ప్రకటిస్తామని తెలిపారు.