భద్రాచలం నుంచి ఎటపాక మండలం పురుషోత్తపట్నం కు వెళ్లే ప్రధాన రహదారి శ్రీరాంనగర్ కాలనీ వద్ద దుకాణాదారులంతా రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల రోడ్డు అంతా స్తంభించిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఎటపాక మండల సంబంధిత అధికారులు పట్టించుకోని రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించిన దుకాణాలను తీసివేయాలని వాహనదారులు కోరుతున్నారు.