అడ్డతీగల: కారు ఢీకొని రెండు పాడి గేదెలు మృతి

78చూసినవారు
అడ్డతీగల: కారు ఢీకొని రెండు పాడి గేదెలు మృతి
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం సచివాలయం ఎదురుగా జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు ఢీకొని రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ కారు జాతీయ రహదారి పనులు పర్యవేక్షిస్తున్న సిబ్బందికి చెందినదిగా సమాచారం. జీవనాధారంగా ఉన్న పాడి గేదెలు చనిపోయాయని వాటి యజమానులు లబోదిబోమంటున్నారు.

సంబంధిత పోస్ట్