మోతుగూడెంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో సీలేరు జలాశయాల్లో నీటి మట్టాలు స్వల్పంగా పెరిగాయి. జెన్కో అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, జోలాపుట్టుకు 8936, బలిమెలకు 19,439, సీలేరు కు 1655, డొంకరాయికి 4030 క్యూసెక్కుల నీరు వచ్చిందన్నారు. బలిమెల, జోలాపుట్లలో కలిపి 28.91 టీఎంసీలు ఉండగా, అందులో ఏపీ వాటా 16.07 టీఎంసీలు.