రక్షిత తాగునీరు అందించేందుకు కార్యాచరణ: ఎమ్మెల్యే

84చూసినవారు
రక్షిత తాగునీరు అందించేందుకు కార్యాచరణ: ఎమ్మెల్యే
మాచవరం గ్రామ ప్రజలకు రక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ పద్మనాభం, కూటమి శ్రేణులతో మంగళవారం మాచవరం పంచాయతీలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న రక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రూ. 9. 50 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. 4, 367 గృహాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్