అయినవిల్లి మండలం నల్లచెరువు కొలువైన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు ఈనెల 15వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటిరోజు గోపూజ, తులసి పూజ అర్చకులు వేద మంత్రములతో నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.