దిండి - చించినాడ బ్రిడ్జి నిర్వహణ తీరు పై విమర్శలు

56చూసినవారు
దిండి - చించినాడ బ్రిడ్జి నిర్వహణ తీరు పై విమర్శలు
మలికిపురం మండలం దిండి - చించినాడ బ్రిడ్జి నిర్వహణ తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహించిన ఫలితం లేదని వాపోయారు. బ్రిడ్జి పై రోడ్డు బీటలు వాలి పగిలిపోయిందని, ఇనుప ఊచలు బయటకు వచ్చి ప్రమాదకరంగా మారాయని ప్రయాణికులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్