డయేరియాపై అవగాహన కల్పించాలి: ఎంపీపీ

84చూసినవారు
స్టాప్ డయేరియా నియంత్రణ కార్యక్రమ ర్యాలీని సోమవారం సఖినేటిపల్లి పీ. హెచ్. సీ వద్ద ఎంపీపీ వీరా మల్లిబాబు ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులలో డయేరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. దీని నివారణకు గాను అరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలను వివరించాలని సూచించారు. జడ్పీటీసీ దొండపాటి అన్నపూర్ణ, డాక్టర్ గాయత్రి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్