గంజాయి కేసులో దిండి వాసి అరెస్ట్

76చూసినవారు
గంజాయి కేసులో దిండి వాసి అరెస్ట్
సఖినేటిపల్లి మండలం దిండి గ్రామానికి చెందిన మేడిది నరేష్ ను గంజాయి అక్రమ రవాణా కేసులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పోలీసులు అరెస్టు చేశారు. 2023లో నమోదైన గంజాయి కేసులో ముగ్గురిని గతంలోని అరెస్టు చేశామని, నిందితుడు నరేష్ పరారీ అయ్యాడన్నారు. గత కొంత కాలం నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని మంగళవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించిందని నరసాపురం టౌన్ సీఐ యాదగిరి తెలిపారు.

సంబంధిత పోస్ట్