ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరదలు పెరగడంతో సఖినేటిపల్లి - నరసాపురం మధ్య గోదావరి నదిపై పంటు, నాటుపడవలపై రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ముందస్తు జాగ్రత్తగా గోదావరిపై రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు.