వాతవరణం మార్పుల నేపధ్యంలో గురువారం వేకువజామున నుంచి రాజోలు మండలం వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. వర్షానికి ఉదయం పంట పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడ్డారు. భారీగా కురిసిన వర్షానికి శివకోడు 18 ఎకరాల కాలనీ, పలు జగనన్న లేఅవుట్లు ముంపుకు గురయ్యాయి.