సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది, కేశవదాసుపాలెం, గొంది, సఖినేటిపల్లి, అంతర్వేది పాలెం గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజల రోజు వారీ పనులకు అంతరాయం ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు.