అంతర్వేది నరసింహస్వామిని దర్శించుకొన్న హైకోర్ట్ జస్టిస్

54చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జస్టిస్ రవీంద్ర బాబు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈవో సత్యనారాయణ వారికి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్