సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారు. అనంతరం స్వామి వారి ఆలయములో అత్యంత ప్రాచుర్యం పొందిన నిత్యాన్నదానం నందు సుమారు 6, 000 మంది శ్రీ స్వామి వారి అన్నప్రసాదము స్వీకరించారు. భక్తులు భారీగా తరలిరావడంతో స్వామివారి ఆలయంలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.