కొబ్బరి తోటలో పిడుగు పడి మంటలు ఎగసిపడ్డాయి. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో ఆదివారం రాత్రి సంఘటన జరిగింది. కొబ్బరి తోటల నుండి మంటలు వ్యాపించి ఇళ్లపైకి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.