మలికిపురం మండలం లక్కవరంలో ప్రసిద్ధిగాంచిన బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలలో భాగంగా మంగళవారం ప్రభల ఊరేగింపు ఘనంగా జరిగింది. బాణాసంచా కాల్పులు, గరగల నృత్యాలు, తీన్మార్ డబ్బులతో మూడు ప్రభలను ఊరేగించారు. జాతర మహోత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.