విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడిన అదానీని అరెస్ట్ చేయాలని కోరుతూ మంగళవారం మలికిపురం మండలం మలికిపురంలో సీపీఐ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సెంటర్ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో విద్యుత్ ఒప్పందాల్లో విపరీతమైన అవినీతి జరిగినా మోడీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడమే కాకుండా అదానిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోవడం దారుణం అన్నారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందజేశారు.