మలికిపురం మండలం లక్కవరానికి చెందిన జిల్లా టెలికాం సలహా మండలి మాజీ సభ్యుడు రుద్రరాజు గోపాల కృష్ణంరాజు రాజోలు డివిజన్లో టెలికం వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను శుక్రవారం బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి తూ. గో. జిల్లా టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు. రాజమండ్రిలో ఆయనను కలిసి 3జీ నుంచి 4జీకి మారినప్పటికీ సిగ్నల్ సరిగ్గా రావడం లేదన్నారు. కాల్ కట్ అవటం, నెట్ కూడా పనిచేయడం లేదన్నారు.