అమరావతి మహిళలను అవమానించిన ఒక ఛానల్ లైసెన్స్ ను రద్దు చేయాలంటూ మహిళలు నిరసన తెలిపారు. మలికిపురం మూడు రోడ్ల ప్రధాన కూడలిలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కూటమి నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సేవ్ అమరావతి డౌన్ డౌన్ జగన్ అంటూ నినాదాలు చేశారు.