మలికిపురం: పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు

75చూసినవారు
మలికిపురం మండలం గుడిమెలంక, మలికిపురం గ్రామాల పరిధిలో గత 15 రోజులుగా పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగడం లేదని, కొన్ని ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా వెలుగుతూనే ఉంటున్నాయని స్థానికులు ఆదివారం చెప్పారు. కేవలం రాత్రి సమయంలో వీధి దీపాలు వెలిగేలా అధికారుల దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్