డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లకు మలికిపురం ఎస్సై సురేశ్ శనివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం నేరమని ఆయన పేర్కొన్నారు. మైనర్లతో వారి తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం నేరమని, మైనర్లకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.