మలికిపురం: నూకాలమ్మ ఊయల ఉత్సవం

71చూసినవారు
మలికిపురం మండలం గూడపల్లి గ్రామ దేవత నూకాలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం ఊయలోత్సవం రమణీయంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ ఆసాధులు ఊయలలో అమ్మవారి ప్రతిరూపాలైన గరగలను అధిష్టించి ఉత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగలా జరిగింది. భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఊయల ఉత్సవాన్ని తిలకించారు. భక్తులు అమ్మ వారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు.

సంబంధిత పోస్ట్