రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతోందని, కూటమి ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వం అని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మలికిపురం మండలం మలికిపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పెన్షన్లు మినహా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు.