సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే అని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొనియాడారు. మలికిపురం మండలం విశ్వేశ్వరపురంలో గురువారం ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే దేవర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు ఉన్నారు.