మలికిపురం మండలం మలికిపురం ప్రధాన కూడలిలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని రంగా తనయుడు వంగవీటి రాధ శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అభిమానులతో ఆయన భారీ ర్యాలీగా వచ్చి, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తో కలిసి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని, రంగా ఆశయాలను ప్రతి ఒక్కరు పూర్తిగా తీసుకోవాలన్నారు.