మామిడికుదురు: ఈదురు గాలులతో భారీ వర్షం

53చూసినవారు
మామిడికుదురు మండలం వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం సాధారణంగానే ఉండి విపరీతమైన ఎండ కాచింది. సాయంత్రం ఒక్క సారిగా వాతావరణం మారి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కల్లాలలోనే ఉండిపోవడంతో రైతులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తమ పరిస్థితి దారుణంగా తయారైందని రైతులు వాపోయారు.

సంబంధిత పోస్ట్