మామిడికుదురు: కొబ్బరి చెట్టు నుంచి జారి పడి ఒకరి మృతి

50చూసినవారు
జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు బొండాలు తీద్దామని కొబ్బరి చెట్టు ఎక్కిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన మామిడికుదురు మండలంలో జరిగింది. గ్రామస్థుడు అశోక్ కుమార్ (35) కొబ్బరికాయాలు తీసేందుకు శుక్రవారం రాత్రి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్