రాజోలు నియోజకవర్గం పరిధిలోని మామిడికుదురు మండలం పరిధిలో ఈ నెల 17న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఈఈ రాంబాబు మంగళవారం తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మగటపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గోగన్నమఠం, మగటపల్లి, కొమరాడ, ఈదరాడ గ్రామాలకు సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.