మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ ఇమామ్ హుసేన్ పరివారానికి శనివారం ముస్లింలు నివాళులర్పించారు. మొహర్రం సంతాప కార్యక్రమాల్లో భాగంగా మామిడికుదురు మండలం నగరంలో హజరత్ అబ్బాస్ పంజా నందు మజిలీ జరిగింది. మత ప్రబోధకులు మహమ్మద్ అలీ జాఫరీ కర్బలా పుణ్యభూమిలో హజరత్ అబ్బాస్ వీరత్వం మరియు అమరత్వం గురించి భక్తులకు వివరించారు. హజరత్ అబ్బాస్ గుమ్మటం ఊరేగించి మాతమ్ నిర్వహించారు.