త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈదరాడలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు తగ్గడంతో మామిడికుదురు మండలంలోని మగటపల్లి, ఈదరాడ, కొమరాడ గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామ పంచాయతీ నిధులతో ఈ సమస్యను తాత్కాలికంగా అధిగమిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జయశ్రీ మంగళవారం తెలిపారు.