పేద ప్రజల సంక్షేమమే అజెండాగా వైయస్సార్సీపీ ముందుకు వెళ్తేందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మామిడికుదురులో బుధవారం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మాజీ సీఎం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ మట్టా శైలజ, పార్టీ నేతలు కేఎస్ఎన్ రాజు, బొలిశెట్టి భగవాన్, కటకంశెట్టి ఆదిత్య పాల్గొన్నారు.