సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నూతన అన్నదాన భవన నిర్మాణానికి, సముద్ర తీరంలో భక్తుల సౌకర్యార్థం దుస్తులు మార్చుకొనే గదుల నిర్మాణం తదితర వాటిపై చర్చించారు. ఎండోమెంట్ ఈఈ దుర్గేష్, డీఈ శ్రీనివాస్, డీఏ శ్రీనివాసచార్యులు ఉన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.