రాజోలు మండలం కడలి గ్రామంలోని శ్రీ కపోతేశ్వర స్వామి వారి కళ్యాణం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు స్వామివారి కల్యాణం వేదమంత్రాలు నడుమ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.