సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిపాలెంకు చెందిన హ్యుమానిటీ హార్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తాడి సహదేవ్ కు జాతీయస్థాయి సేవారత్న అవార్డు లభించింది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ విజయవాడ పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ వారు సేవా రత్న అవార్డును అందజేసినట్లు సహదేవ్ శనివారం మీడియాకు తెలిపారు. ఆయనను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.