రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన లిఖితపూడి ప్రవల్లిక ఇంటర్మీడియట్లో ప్రవల్లిక అత్యధిక మార్కులు సాధించింది. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారం లభించింది. రాజమహేంద్రవరం త్యాగరాజ గానసభలో సోమవారం జరిగిన సమావేశంలో కలక్టర్ ప్రశాంతి, మంత్రులు రామానాయుడు, దుర్గేష్, ఎమ్మెల్యేలు చౌదరి, వాసు, బలరామకృష్ణ చేతుల మీదుగా ప్రవళికకు ప్రశంస పత్రం, గోల్డ్ మెడల్, రూ. 20 వేలు చెక్కును అందించారు.