సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏసీగా పనిచేసిన సత్యనారాయణ కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన అసిస్టెంట్ కమిషనర్ గా ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకుల నుంచి ఆయన వేద ఆశీర్వచనం అందుకున్నారు.