యువత పోరుబాట కార్యక్రమానికి రాజోలు నియోజకవర్గం నుంచి బుధవారం వైసీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో మామిడికుదురు సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. గొల్లపల్లి స్వయంగా మోటార్ సైకిల్ ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. యువతను నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వాగ్దానాలను ఎన్డీఏ పూర్తిగా విస్మరించిందన్నారు.