రాజోలు మండలం తాటిపాక గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు సెక్టార్ మీటింగ్ సూపర్వైజర్ సరస్వతి అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేశారు. జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వర్కర్ త్రిమూర్తులు మాట్లాడుతూ అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి కాకుండా వివాహం చేయడం చట్ట రీత్యా నేరమని, బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులకు లక్ష జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని అన్నారు.