రాజోలు మండలం శివకోటి హైస్కూల్లో శనివారం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో గందరగోళం నెలకొంది. సమావేశం అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులకు భోజనం అందకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలితో అల్లాడుతున్న పిల్లలను చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు స్కూల్ హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించే తీరు ఇదేనా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.