సోషల్ ఆడిట్ లో భాగంగా షెడ్యూల్ కులాల జాబితాకు సంబంధించిన విషయాలపై శుక్రవారం దళిత చైతన్య వేదిక నాయకులు రాజోలు తహసీల్దార్ ప్రసాద్ తో చర్చించారు. మండల పరిధిలోని 16 గ్రామాల్లో ఎస్సీ కులాల జాబితాలో లోపాలు లేకుండా వీఆర్వోల ద్వారా సరి చేయించాలన్నారు. దీనికి ఎమ్మార్వో అంగీకరించారు. కార్యక్రమంలో వేదిక నేతలు మురళీకృష్ణ, సురేశ్, శ్రీధర్, మధు, మోహన్ ఉన్నారు.