ధాన్యం కొనుగోలు చేయకుండా తమను రెండు రోజుల నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాజోలు మండలం శివకోటికి చెందిన రైతులు శనివారం జాతీయ రహదారికి అడ్డంగా ధాన్యం బస్తాల లోడుతో ఉన్న ట్రాక్టర్ ను పెట్టి నిరసన తెలిపారు. ఆర్బీకే ఉద్యోగి నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రైతులు రామారావు, వెంకటరత్నం, సత్యనారాయణ, నాగేశ్వరరావు, శ్రీను, గోపాలం ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా తమకు అందుబాటులో లేదని వాపోయారు.