బీజేపీ పిలుపు మేరకు రాజోలులో ఏటిగట్టు పొడవునా మాజీ ఎమ్మెల్యే వేమ బుధవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. అమ్మ పేరున ఒక మొక్క నాటాలన్న గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించవచ్చన్నారు. ఈ కార్య క్రమంలో నియోజకవర్గ కో కన్వీనర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు.