రాజోలు పంచాయతీరాజ్ నూతన డీఈ గా కృష్ణంరాజు బుధవారం పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏఈగా పనిచేస్తున్న కృష్ణంరాజు పదోన్నతిపై రాజోలు డీఈగా నియమితులయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో పనుల నాణ్యతతో సకాలంలో పూర్తి అయ్యే విధంగా కార్యచరణ రూపొందించామన్నారు. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు.