వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజోలు మండలం గెద్దాడకు చెందిన జి. శ్రీనివాసరావు(56) వ్యక్తిగత కారణాలతో పురుగు మందు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో 13న కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్ లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందగా రాజోలు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.