రాజోలు మండలంలోని శివకోటి అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గుడ్విల్ ఎడ్యుకేషనల్ & సోషల్ సర్వీస్ సోసైటీ ఎన్. జీ. ఓ ఆధ్వర్యంలో మంగళవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 546 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. 30 మంది విద్యార్థులకు కళ్ళ జోళ్ళు అందజేశారని పాఠశాల ప్రిన్సిపల్ లలిత కుమారి తెలిపారు.