సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామములో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశిర్వచనం అందించారు. అనంతరం ఆలయ సూపరిండెంట్ పి. విజయసారధి స్వామి వారి చిత్రపటం అందజేసారు.