రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు. వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం రక్తం దానం చేసిన దాతలను ఎమ్మెల్యే అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.